దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారు కావడంతో మార్కెట్లలో జోష్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. సెన్సెక్స్ మరోసారి 80 వేల మార్కును అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 723 పాయింట్ల లాభంతో 80,211 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 209 పాయింట్లు పుంజుకుని 24,422కి చేరుకుంది.ఐటీ, టెక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్ 3.88 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 3.82 శాతం, టెక్ మహీంద్రా 3.77 శాతం, ఇన్ఫోసిస్ 3.77 శాతం లాభపడ్డాయి. గత సెషన్‌లో మంగళవారం 79,476 వద్ద క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు లాభాల్లో దూసుకుపోతున్నాయి. మంగళవారం 24,213 దగ్గర ఆగిన NSE నిఫ్టీ ఈ రోజు 209 పాయింట్లతో 24,422.75 వద్దకు చేరుకుంది.