దశాబ్ధానికి పైగా టెలికాం రంగంలోని పోటీలో వెనుకబడిన బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీలతో తన యుద్ధాన్ని ప్రారంభించింది. జియోని దేశంలో ప్రజలకు పరిచయం చేసేందుకు వాడిన తక్కువ రేట్ల ప్రణాళికను ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ వాడుతూ చాపకింద నీరులా కస్టమర్లను సొంతం చేసుకుంటోందిఅంబానీ వ్యూహాలకు మించిన పనితీరుతో ప్రైవేటు టెలికాం ఆటగాళ్లను గడగడలాడిస్తోంది.తాజాగా బీఎస్ఎన్ఎల్ ట్విట్టర్ ఖాతా పోస్టులో కీలక విషయాన్ని ప్రకటించింది. దేశంలోని ప్రైవేటు ఆటగాళ్లకు ఏమాత్రం తగ్గకుండా బీఎస్ఎన్ఎల్ తన కవరేజీని కొత్త టవర్లను వేగవంతమైన ఇన్‌స్టలేషన్ ద్వారా పెంచుతోంది. తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కవరేజీని పెంచేందుకు 5000 కొత్త టవర్ల ఏర్పాటును పూర్తిచేసినట్లు పేర్కొంది. దీనివల్ల కవరేజీని దేశంలోని 95 శాతానికి పెంచినట్లు పేర్కొంది. మిగిలిన 5 శాతం ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ కవరేజీని విస్తరించటానికి వేగంగా కార్యాచరణ జరుగుతోందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం కంపెనీ తన 4జీ సేవలను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా 50,000 టవర్లను స్థాపించగా వీటిలో దాదాపు 41,000 ఇప్పటికే వినియోగంలోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వాస్తవానికి టాటా గ్రూప్ సహకారంలో ప్రభుత్వ టెలికాం సంస్థ వృద్ధి రేసులో దూసుకుపోతోంది. రానున్న జులై నాటికి 4జీ సేవలను జూన్ 2025 నాటికి దేశవ్యాప్తంగా ప్రారంభించటానికి వీలుగా లక్ష మొబైల్ టవర్ల ఏర్పాటు లక్ష్యంతో నిర్విరామంగా కృషిని కొనసాగిస్తోంది. దీని తర్వాత 5జీ సేవలను రోలౌట్ చేయాలని బీఎస్ఎన్ఎల్ చూస్తోంది. కొన్ని నెలల కిందట ప్రైవేటు ఆటగాళ్లు జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియా తమ టారిఫ్ రేట్లను పెంచటంతో చాలా మంది యూజర్లు మెల్లగా ఘర్ వాపసీ నినాదంతో కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
ఆఫీసుకి వెళ్లకుండానే సిమ్ కార్డ్..?
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ వినియోగదారునిగా మారాలంటే మార్కెట్లో అక్కడక్కడా ఏర్పాటు చేసే స్టాళ్లు లేదా సమీపంలోని ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించటానికి త్వరలోనే ఆటోమేటిక్‌గా సిమ్ కార్డులను పంపిణీ చేసే ఏటీఎం వంటి యంత్రాన్ని ఉపయోగించనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. కస్టమర్‌లు తమ BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా కొత్త SIM కార్డ్‌ని పొందేందుకు సైతం వెసులుబాటును కంపెనీ అందుబాటులోకి తీసుకొస్తోంది.
సిమ్ కార్డు లేకుండా ఫోన్ కాల్స్..!!
ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ D2D టెక్నాలజీని పరీక్షించింది. డైరెక్ట్ టు డివైస్ అని పిలువబడే ఈ సాంకేతికత ప్రకారం కస్టమర్లు నేరుగా సిమ్ కార్డు లేకుండానే కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ తెలుపుతూ చేసిన పరీక్ష సైతం విజయవంతంగా నిలిచింది. దీని కింద యూజర్లు నెట్‌వర్క్ లేకుండానే ఆడియో, వీడియో కాల్స్ చేసుకోగలరని తేలింది. అసలు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో సైతం ఇది కమ్యూనికేషన్ సులభతరం చేసింది.స్తవానికి D2D అనేది స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు మరియు కార్లను నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయడానికి అనుమతించే న్యూ ఏజ్ టెక్నాలజీ. దీని ప్రదర్శన ప్రస్తుతం ప్రైవేటు టెలికాం సంస్థలైన అంబానీకి చెందిన జియో, ఎయిర్ టెల్, విఐకి నిద్రలేకుండా చేస్తోంది. ఇది చూస్తుంటే త్వరలోనే బీఎస్ఎన్ఎల్ తన పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకోవచ్చని తెలుస్తోంది.