ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిట్‌కాయిన్స్ ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్..

business |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 11:39 AM

బిట్‌కాయిన్ మళ్లీ దూసుకెళ్తోంది. ఇటీవల కొత్త గరిష్ట స్థాయిని తాకింది. డిజిటల్ అసెట్ మార్కెట్‌లో రికార్డు స్థాయి ర్యాలీని సూచిస్తూ $89,000 దాటింది.యూఎస్‌ అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి వ్యాపారులు క్రిప్టో-ఫ్రెండ్లీ పాలసీలను ఆశిస్తుండటంతో బిట్‌కాయిన్‌ జోరు పెరిగింది. ట్రంప్‌ హయాంలో మార్కెట్ మరింత పెరుగుతుందని చాలామంది నమ్ముతున్నారు. యూఎస్‌ ఎలక్షన్‌ రిజల్ట్ వచ్చిన నవంబర్ 5 నుంచి బిట్‌కాయిన్ దాదాపు 30% పెరిగింది. 12న మంగళవారం ఎర్లీ ఏసియన్‌ ట్రేడింగ్‌లో $89,599 ఆల్-టైమ్ హైని చేరుకుంది. దీంతో మొత్తం క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ విలువ మొత్తం $3 ట్రిలియన్లకు పైగా పెరిగింది. కరోనా మహమ్మారి సమయంలో చివరిసారిగా ఈ స్థాయిలో మార్కెట్‌ వ్యాల్యూ పెరిగింది.


* క్రిప్టో మార్కెట్‌కి ట్రంప్ హామీలు


క్రిప్టో వ్యాపారులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు ట్రంప్‌ అనేక హామీలు ఇచ్చారు. అందులో ఏమేం ఉన్నాయంటే..


ఫ్రెండ్లీ క్రిప్టో రూల్స్: క్రిప్టోకరెన్సీని పరిమితం చేయకుండా మద్దతిచ్చే నిబంధనలను రూపొందించడానికి ట్రంప్ హామీ ఇచ్చారు.


బిట్‌కాయిన్ స్టాక్‌పైల్: బిట్‌కాయిన్ వ్యాల్యూకి సపోర్ట్‌ చేయడానికి, డిజిటల్ అసెట్స్‌ నేషనాలిటీ ఓనర్‌షిప్‌ ప్రోత్సహించడానికి యూఎస్‌ స్టాక్‌పైల్‌ను నిర్మించాలని కూడా ట్రంప్‌ సూచించారు.


డొమెస్టిక్ మైనింగ్‌ను పెంచడం: యూఎస్‌లో బిట్‌కాయిన్ మైనింగ్‌ను పెంచాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఈ రంగానికి కొత్త పెట్టుబడులు తీసుకురాగలదు, అలాగే కొత్త ఉద్యోగాలను సృష్టించగలదు.


ఈ ఇండస్ట్రీ అణిచివేతకు సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) దృష్టి సారించిన ప్రెసిడెంట్ జో బైడెన్‌ పాలనకు, ట్రంప్‌ విధానాలకు చాలా తేడా కనిపిస్తోంది. అందుకే ట్రంప్‌ గెలవడంతో బిట్‌కాయిన్‌ కొత్త శిఖరాలను తాకుతోంది.


* మార్కెట్‌ని నడిపిస్తోంది ఏంటి?


క్రిప్టోకరెన్సీలకు మరింత సహాయక వాతావరణం ఉండే అవకాశం పెద్ద, చిన్న టోకెన్లు రెండింటికీ ప్రయోజనం చేకూర్చింది. దీంతో మార్కెట్‌లో ఊహాజనిత కొనుగోళ్లు పెరిగాయి. బిట్‌కాయిన్ ప్రస్తుతం స్టాక్స్, బంగారం వంటి ఇతర పెట్టుబడులను అధిగమిస్తోంది. పెప్పర్‌స్టోన్ గ్రూప్‌లోని రీసెర్చ్ హెడ్ క్రిస్ వెస్టన్ మాట్లాడుతూ, బిట్‌కాయిన్ పెరుగుదలను 'బీస్ట్ మోడ్'లో ఉన్నట్లు వివరించారు. చాలా మంది వ్యాపారులు ఇప్పుడు మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలా? లేదా కొంచెం ప్రైస్‌ తగ్గే వరకు వేచి ఉండాలా? అని చర్చించుకుంటున్నట్లు చెప్పారు.


* $100,000కి చేరుకుంటుందని అంచనా


బిట్‌కాయిన్ సంవత్సరం చివరి నాటికి $100,000 మార్కును దాటవచ్చని ఆప్షన్స్‌ మార్కెట్లో కొంతమంది ఇన్వెస్టర్లు బెట్టింగ్ చేస్తున్నారు. డెరిబిట్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, ఈ అంచనాలు బిట్‌కాయిన్ చుట్టూ ప్రస్తుతం నెలకొన్న ఉత్సాహం, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కార్పొరేషన్లు కూడా బిట్‌కాయిన్‌పై ఫోకస్ పెడుతున్నాయి. ఉదాహరణకు మైక్రోస్ట్రాటజీ ఇంక్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ETF) అక్టోబర్ 31- నవంబర్ 10 మధ్య సుమారు $2 బిలియన్లకు సుమారు 27,200 బిట్‌కాయిన్స్ కొనుగోలు చేసింది. 2024లో యూఎస్‌ బిట్‌కాయిన్ ఇటిఎఫ్స్ (ఎక్స్‌ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్), ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుల డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇవి కూడా బిట్‌కాయిన్ ఆకర్షణను మరింత పెంచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com