ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీడీపీ నీచపు పోస్టులు చేసిందని ఆమె గుర్తు చేశారు. ఇదే సమయంలో ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా వైయస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ నేతలు పెడుతున్న తప్పుడు పోస్టులపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వైయస్ఆర్సీపీ నేతలు సోమవారం ఫిర్యాదు చేఆరు. తిరుపతి ఎంపీ ఎం. గురుమూర్తి, మాజీ మంత్రులు నారాయణ స్వామి, ఆర్.కే.రోజా, తిరుపతి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి వైయస్ఆర్సీపీ ఇంఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పలువురు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.