కూటమి ప్రభుత్వం అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తోంది అని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ... కూటమి కార్యకర్తలు, మద్దతుదారులు.. మా పార్టీ అధినేత వైయస్ జగన్‌పై, మహిళా నాయకులపై అసహ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు చేశారు. రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులను ఐ-టీడీపీ ద్వారా వాళ్లే సృష్టించి, అది మాపై నెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా అమాయకులపై కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ఐ-టీడీపీ ద్వారానే చాలా పోస్టులు వచ్చాయి. వాటిపైనే ఫిర్యాదు చేశాం.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వారికి రిసీవ్డ్ కాపీ ఇవ్వాలి. కానీ, ఇవ్వకుండా మాతో దారుణంగా వ్యవహరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండు చేశారు. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు తీసుకుని రిసీవ్డ్ కాపీ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడానికి జంకుతున్నారు, ఒక ఎంపీ, మేయర్, మాజీ డిప్యూటీ సీఎం పీఎస్‌కు వస్తే పోలీసులు వ్యవహరించేది ఇలాగేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఇలా వ్యవహరిస్తే ఇంకెక్కడి న్యాయం జరుగుతుందని ఫైర్ అయ్యారు.