మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో రూ.1082 కోట్ల విలువైన ఎన్నికల తాయిలాలను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. సీజ్ చేసిన దాంట్లో రూ.181.97 కోట్లు నగదు కాగా.. రూ.119.83 కోట్ల విలువ చేసే మద్యం, రూ.123.57 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.302.08 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.354.76 కోట్ల విలువైన ఉచితాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు ఈసీ పేర్కొంది.