ఇటీవల బ్రిక్స్ సదస్సులో ఇరు దేశాధినేతలు చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా భారత్తో కలిసి పనిచేస్తామని చైనా పేర్కోంది. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవడం, కమ్యూనికేషన్ ఏర్పాటు, సహకారానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. బ్రెజిల్లో జీ20 సదస్సు వేదికగా మోదీ-షీ జిన్పింగ్ల భేటీ ఉంటుందా? లేదా అన్న ప్రశ్నపై చైనా విదేశాంగ శాఖ ఈమేరకు స్పందించింది.