ఆమె ఒక టీవీ యాంకర్. ఈ వృత్తితోపాటు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫోటోలు, రీల్స్, వీడియోలతో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. సోషల్ మీడియాలో ఆమెకు భారీగా ఫాలోయింగ్ ఉంది. ఒక్క ఫోటో, వీడియో, రీల్ పెట్టిందంటే చాలు.. జనాలు లక్షల్లో వ్యూస్, లైక్స్, షేర్స్ చేస్తూ ఉంటారు. దీంతో సోషల్ మీడియా ద్వారా బాగానే డబ్బును ఆర్జిస్తోంది. ఇప్పుడు అదే ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కమ్ టీవీ యాంకర్‌కు సంబంధించిన ప్రైవేటు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుండటం ఆమెతోపాటు, ఆమె ఫ్యాన్స్‌కు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో స్వయంగా ఆమె స్పందించారు.
పాకిస్తాన్‌కు చెందిన 32 ఏళ్ల మథిర మహ్మద్.. టీవీ హోస్ట్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, నటిగా, డ్యాన్సర్‌గా, మోడల్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మథిర మహ్మద్‌కు చెందిన ప్రైవేటు వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం సంచలనం రేపుతోంది. అయితే ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు వైరల్ అవుతున్న వేళ.. తాజాగా మథిర మహ్మద్ వీడియోలు బయటికి రావడం సంచనలం రేపుతోంది. ఇటీవల టిక్‌టాక్ స్టార్ ఇమ్షా రెహ్మాన్ ప్రైవేటు వీడియో వైరల్ కాగా.. తాజాగా మథిర మహ్మద్ వీడియోలు బయటికి రావడం తీవ్ర దుమారం రేపుతోంది.
మథిర మహ్మద్‌కు దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లు ఉండగా.. అందులో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తన ఫోటోలు, వీడియోలు, యాడ్స్‌తో నిత్యం ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే మథిర మహ్మద్‌కు సంబంధించిన అభ్యంతరమైన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
ఈ క్రమంలోనే ఈ వీడియోలను మథిర మహ్మద్ తీవ్రంగా తప్పుపట్టారు. తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తూ ఫేక్ కంటెంట్‌ను వైరల్ చేస్తున్నారని వాటిని ఖండించారు. ఇలాంటి వాటికి తనను దూరంగా ఉంచాలంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇక పాకిస్తాన్‌కు చెందిన ఇమ్షా రెహ్మాన్ అనే టిక్‌టాక్ స్టార్ వీడియో కూడా ఇటీవలె సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీంతో ఆమె వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్లన్నీ డీయాక్టివేట్ చేశారు.