ఈక్విటీ పెట్టుబడుల్లో హైరిటర్న్స్ ఉంటాయని మీరు వినే ఉంటారు. చాలా రకాల ఫండ్స్ ఆ వాదనలను నిజం చేసి చూపించాయి. గత కొన్ని సంవత్సరాలుగా పలు రకాల మ్యూచువల్ ఫండ్స్ హైరిటర్న్స్ ఇస్తూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్ రిటర్న్స్ దాటి రాణిస్తుండడం గమనార్హం. దీంతో చాలా మంది రిస్క్ తీసుకుని మ్యూచువల్ ఫండ్స్‌లో తమ డబ్బులు పెడుతున్నారు. అలాంటి హైరిటర్న్స్ అందించిన ఓ ఫండ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే డీఎస్‌పీ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ స్కీమ్ గత 5 ఏళ్లలో సగటున వార్షిక రిటర్న్స్ 20 శాతానికిపైగా అందించింది.
ఈ స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్ స్కీమ్‌ను జూన్ 14, 2007లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫండ్ అసెట్ విలువ రూ.16,147 కోట్లుగా ఉంది. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ బీఎస్ఈ 250 స్మాల్ క్యాప్ టోటల్ రిటర్న్ ఇండెక్స్. ఈ పథకంలో లంప్‌సమ్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. లంప్‌సమ్, సిప్ కనీస పెట్టుబడి రూ.100గా ఉంది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. లంప్‌సమ్ రిటర్న్స్ చూస్తే బెంచ్‌మార్క్ రిటర్న్స్‌ను అనుసరించిన ఈ ఫండ్ సిప్ పెట్టుబడిలో మాత్రం బెంచ్ మార్క్‌ను దాటి లాభాలు అందించింది.
రూ.10 వేల పొదుపుతో రూ.10 లక్షలు..
డీఎస్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్ గత ఐదేళ్లలో మంచి రిటర్న్స్ అందించింది. గత ఏడాది కాలంలో చూసుకుంటే వార్షిక రిటర్న్స్ సగటున 26.10 శాతంగా ఉన్నాయి. బెంచ్ మార్క్ 22.04 శాతంగా ఉంది. అదే గత మూడేళ్లలో అయితే ఈ ఫండ్ సగటు వార్షిక రాబడి 23.46 శాతంగా ఉంది. బెంచ్ మార్క్ ఇండెక్స్ రిటర్న్స్ 16.24 శాతంగానే ఉంది. ఇక గత ఐదు సంవత్సరాల కాలంలో చూస్తే సగటు వార్షిక రాబడి 20.21 శాతంగా ఉంది. బెంచ్ మార్క్ ఇండెక్స్ 12.08 శాతంగా రిటర్న్స్ ఇచ్చింది. ఈ పథకంలో గనగా గత 5 ఏళ్ల క్రితం నుంచి నెలకు రూ.10 వేల చొప్పున క్రమానిగత పెట్టుబడి విధానం (సిప్)లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.10 లక్షలకుపైగా అయి ఉంటుంది. పెట్టుబడి మొత్తం రూ.6 లక్షలు, దానిపైన రూ.4 లక్షల వడ్డీ లభిస్తుంది. మూడేళ్ల క్రితం రూ.10 వేల పెట్టుబడిని ప్రారంభిస్తే ఇప్పుడు వారి యూనిట్ల విలువ రూ.5 లక్షలకుపైగా ఉంటుంది.