రాష్ట్రవ్యాప్తంగా గతనెల 25న అన్నిజిల్లాలో ఆయు్షఆస్పత్రులు, మందులషాపులపై దాడులు జరిగాయి. ఈక్రమంలోనే అనంత జిల్లాలో విజిలెన్స డీఎస్పీ నాగభూషణం, సీఐ శ్రీనివాసులు, ఏఓ వాసుప్రకాష్, జిల్లా డ్రగ్స్ ఇనస్పెక్టరు రమే్‌షరెడ్డి బృందం తనిఖీలు నిర్వహించింది. జిల్లాకేంద్రంలోని ఆరు ఆయుష్ ఆస్పత్రులతోపాటు అక్కడే నిర్వహిస్తున్న ఆయుష్ మందుల షాపులను తనిఖీ చేశారు. ఇందులో నాలుగు ఆస్పత్రులు, మందుల షాపులు ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు బయటపడింది. జిల్లా కేంద్రంలోని కమలానగర్లో ఉన్న మెహతాఆయుర్వేద హాస్పిటల్, రామచంద్రనగర్లోని సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్, అరవిందనగర్‌లోని కేరళ అమూల్య ఆయుష్ హాస్పిటల్, సాయినగర్‌లోని ధన్వంతరి ఆయుష్ హాస్పిటల్‌తోపాటు అక్కడే నిర్వహిస్తున్న ఆయుష్ మందుల షాపులను విజిలెన్సశాఖ అధికారులు సీజ్ చేశారు.