ఇండియాపై 'బిల్ గేట్స్' చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనికి భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. రీడ్ హాఫ్ మన్ తో బిల్ గేట్స్ ఇటీవల చేసిన ఒక పాడ్ కాస్ట్ చేశారు. అది వైరల్ గా మారింది. కానీ అందులో తాను భారతదేశాన్ని "వివిధ అంశాలను పరిశీలించడానికి ఒక రకమైన ప్రయోగశాల"గా ఉపయోగిస్తున్నానని బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యపై భారతీయులు మండిపడుతున్నారు. ఆయన భారతదేశాన్ని, భారతీయులను అవమానించారని నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తన వ్యాఖ్యలను గేట్స్ వెనక్కు తీసుకుని, భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకీ బిల్ గేట్స్ ఏమన్నారంటే..'రత్ లో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిలో ఆరోగ్యం, పోషకాహారం, విద్య ముఖ్యమైనవి. అయితే, గత కొన్నేళ్లుగా భారత్ ఈ రంగాల్లో మెరుగుపడుతోంది. సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నాయి. 20 ఏళ్ల తర్వాత భారతదేశంలో ప్రజలు మరింత మెరుగుపడతారు. ఆయా అంశలను నిశితంగా పరిశీలించడానికి భారత్ ఒక ప్రయోగశాల లాంటిది. దేశంలో ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య మెరుగుపడుతున్నాయి, కానీ, అక్కడ ఇంకా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. భారత్ లో ఈ విషయాలను అధ్యయనం చేసి, వాటిని ఇతర దేశాల్లో అమలు చేయడానికి ప్రయత్నించవచ్చు'' అని బిల్ గేట్స్ ఆ పాడ్ కాస్ట్ లో అన్నారు. అందుకే, అమెరికా తరువాత, తమ ఫౌండేషన్ కు చెందిన అతిపెద్ద కార్యాలయం భారత్ లోనే ఉందని బిల్ గేట్స్ తెలిపారు. అలాగే, తమ ఫౌండేషన్ ద్వారా అత్యధిక పైలట్ ప్రాజెక్టులు భారతదేశంలోనే కొనసాగుతున్నాయని వెల్లడించారు.