కడప ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సింహాద్రిపురం మండలం హిమాకుంట్ల ఎస్సీ కాలనీలోని ఇళ్లకు కరెంటు బిల్లులు చెల్లించలేదంటూ విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేయడంతో అంధకారంలో గడిపారు. సమాచారం తెలుసుకున్న ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మూడున్నర లక్షల విద్యుత్ బకాయిలకు సొంత డబ్బుతో చెల్లించారు. ఎస్సీ కాలనీ వాసులకు కరెంటు పునరుద్ధరించడంతో ఎంపీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.