లంబసింగి వ్యూ పాయింట్ తాత్కాలికంగా మూసివేసారు. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగి పడుతుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు బుధవారం నుంచి వ్యూ పాయింట్ మూసివేసారు.
దీంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. శీతాకాలం కావడంతో లంబసింగి వచ్చిన పర్యాటకులు చెరువుల వేనం ప్యూ పాయింట్ సందర్శించి పకృతి అందాలను పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక మూసివేత నిరాశకు గురిచేసింది.