భూమి పైకి దూసుకొచ్చిన ఒక చిన్న గ్రహశకలం రష్యా భూభాగాన్ని తాకింది. అయితే, వాతావరణంలోనే అది మండిపోవడంతో కాసేపు మెరుపులు మెరిశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
70 సెంటీమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన గ్రహశకలాన్ని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ ముందుగానే గుర్తించింది. ఆ గ్రహశకలం మంగళవారం సాయంత్రం ఈశాన్య రష్యాలోని ఓ మారుమూల ప్రాంతం దిశగా దూసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.