ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకి సాగుభూమి ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 08:29 PM

పేదలకు సాగు భూమి ఇచ్చే వరకు పోరాటం ఆగదని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. సోమవారం పులివెందుల ఆర్డీఓ కా ర్యాలయం వద్ద ఏపీ గిరిజన సమాఖ్య ఏపీజీఎస్‌, దళితుల పోరాట సమితి, దళిత, డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమం లో పులివెందుల రెవెన్యూ డివిజను పరిధిలోని 8 మండలాల్లోని సాగుభూమికి అర్హులైన వారంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ అధికారులు విలువైన ప్రభుత్వ, వంక, వాగు, రస్తా చెరువు, వక్ఫ్‌, ఇనాం భూములను కట్టబెట్టి కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారన్నారు.


పేదలకు రెండు ఎకరాల సా గు భూమి మంజూరు చేయాలన్న రు. పులివెందుల ప్రాంతంలో గతంలో పోరాడి సాధించుకున్న ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నారన్నారు. పాలక ప్రభుత్వాలకు బుద్ధి రావాలంటే పోరాటమే శరణ్యమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి మండలం లో, ప్రతి గ్రామంలో అర్హులైన పేదల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఆ జాబితాలను అసైన్డ కమిటీకి సిఫార్సు చేయాలని డిమాండ్‌ చేశారు.లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి శంకరనాయక్‌, దళిత హ క్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మునెయ్య, దళిత, డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వర్‌రావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేసీ బాదుల్లా, పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకటరాయులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com