హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కులు జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.
స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.