మాజీ ఎమ్మెల్యే పేర్నినాని గోడౌన్‌లో మాయమైన రేషన్ బియ్యం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 243 టన్నుల రేషన్ బియ్యాన్ని దారి మళ్లించేందుకు పేర్ని నాని యత్నించారని ఆరోపించారు.వ్యవస్థలను దారుణంగా ఖూనీ చేశారనేది ప్రజలు గ్రహించాలని మనోహర్ విజ్ఞప్తి చేశారు. తప్పు చేసిన వారిని వదలిపెట్టబోమన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణపై మరో గోడౌన్‌పైనా అనుమానం ఉందని, త్వరలోనే తనిఖీలు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, నిజాయితీగా పని చేస్తామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.మాజీ మంత్రి పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పేదల బియ్యం బొక్కేసి నాని నీతి కబుర్లు చెబుతున్నాడని మంత్రి మండిపడ్డారు. రూ.90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని తినేశారని దుయ్యబట్టారు. పేర్ని కుటుంబ అంతా పరిరీలోనే ఉందన్న మంత్రి.. దొంగ అయన పేర్ని నానికి పరామర్శలు విడ్డూరమని మండిపడ్డారు. వైసీపీ అంతా దొంగల పార్టీనే అని అర్థమవుతోందన్నారు.
మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. పేర్ని నాని కుటుంబసభ్యులపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. గోదాముల్లో రేషన్ బియ్యం తగ్గడంపై కేసు నమోదైంది. ఈ నెల 13న రూ. కోటి, 16న రూ.70 లక్షల డీడీలను పేర్ని నాని అందజేశారు. మరోవైపు నాని భార్య జయసుధ పేరుతో గోదాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అసలు గోదాములో ఎంత బియ్యం తగ్గిందనే దానిపై లోతైన విచారణ చేపట్టారుకృష్ణాజిల్లా రేషన్ బియ్యం కుంభకోణం కేసులో మాజీమంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఈనెల 19కి వాయిదా పడింది. నాని సతీమణి తన గోడౌన్లోని 185టన్నుల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈకేసులో ఆమె గత శుక్రవారం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా నేడు బెంచ్ కు వచ్చింది. ఈ కేసులో పోలీసుల నుంచి సిడి ఫైల్ కోర్టుకు రావాల్సి ఉంది