శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇచ్చాపురం నాలుగు మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ, మండల ఎంపీపీలు. సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.అలానే టెక్కలి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్ మోహనరెడ్డిపుట్టినరోజు సందర్భంగాటెక్కలి నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టెక్కలి నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ నాయకులు మరియు కార్యకర్తల మధ్యలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అలానే ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆముదాలవలస పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైయస్సార్ జంక్షన్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్,మున్సిపల్ నాయకులు కార్యకర్తలు నాలుగు మండల ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీ లు పాల్గొన్నారు.అలానే పొందూరులో మాజీ సీఎం వైయస్.జగన్ పుట్టిన రోజు సందర్బంగా కాలింగ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దుంపల లక్ష్ణణరావు ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచక పాలనతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనపై వైఎస్ఆర్సిపి నాయకులు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.అలానే పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మెలియాపుట్టిలోని వేణుగోపాలస్వామి ఆలయం, పాతపట్నంలోని నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.అలానే టెక్కలి నియోజకవర్గంలో ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ పుట్టినరోజు సందర్భంగా టెక్కలి నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి పేరాడ తిలక్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం వైస్సార్సీపీ 4మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు మరియు కార్యకర్తలు కేక్ కట్ చేసారు. అనంతరం పేద విద్యార్థుల కి దుప్పట్లు పంపిణి చేసి, రక్త దాన శిబిరం నిర్వహించారు.