ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోసం న్యాయ పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అధ్యక్షతన మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వైయస్ఆర్సీపీ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు కోరారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.