అనుకరించడం ద్వారా పిల్లలు భాష నేర్చుకుంటారని మంత్రి సత్యకుమార్‌యాదవ్ అన్నారు. మాతృభాషతో మమేకమైతే తెలివితేటలు పెరుగుతాయన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో మాట్లాడుతూ.. మాతృభాష నేర్చుకున్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందన్నారు.
తన మాతృభాష మరాఠీ అయినా.. తెలుగులోనే చదువుకున్నట్లు వివరించారు. తల్లిదండ్రుల చొరవతోనే మాతృభాష మనుగడ సాధ్యపడుతుందన్నారు. తన పిల్లలకు పెద్ద బాలశిక్ష ఇచ్చి చదవమంటున్నట్లు తెలిపారు.