రాజాం నియోజకవర్గం నాలుగు మండలాల టిడిపి నాయకులతో కలిసి నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ బుధవారం టిడిపి కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. టిడిపి నేతల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కోండ్రు మురళి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని వారు అనుకున్న పనులన్నీ నెరవేరాలంటూ ఆకాంక్షించారు.