ఉత్తరాంధ్ర ఇలవేల్పు కమ్మసిగడాం మహాలక్ష్మి జాతర ఫిబ్రవరి 7 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గురువారం జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మూడు రోజుల పాటు భక్తుల వినోదం కోసం ఏర్పాటు చేసే సాంస్కృతి అంశాలపై చర్చించారు. అనంతరం రామతీర్థం బీటీ రోడ్డు ఆనుకుని అమ్మవారి ఆలయం వరకూ సీసీ రోడ్డు పనుల కోసం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెలిచేటి రామకృష్ణ, వి.రాజరవిచంద్ర, వి.తేజ, వి.రాజశేఖర్, మన్నె లక్ష్మీప్రసాద్, వి.మరళీ, వి.సురేష్‌కుమార్, మన్నె కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు.