ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖపట్నం వచ్చే ప్రధాని నరేంద్రమోదీ విశాఖ కేంద్రంగా మంజూరైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని సీఎం చంద్రబాబునాయుడు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. ముడసర్లోవలో జీవీఎంసీ కేటాయించిన భూముల్లోనే ఈ కార్యాలయ నిర్మాణం జరగనుంది. దీనికి ఇప్పటికే రూ.150 కోట్లు నిధులు కేంద్ర బడ్జెట్‌లో మంజూరుచేశారు.