నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి )ని తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం ఆయనకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన అర్చకులు.. సీఎం చంద్రబాబును ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ క్యాలెండర్ , డైరీ, స్వామి వారి చిత్రపటాన్ని ఈఓ శ్యామలరావు ఆయన కు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం .. ఆయనకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఆలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు.