ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవాళ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి లోకేష్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గెలుపు ఓటములకు భయపడొద్దు అన్నారు.
పరీక్షలు తప్పినందుకు చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. సమానత్వం విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలి అని తెలిపారు.