ఓల్డ్‌సిటీ మెట్రో రైలు భూసేకరణ కోసం ఇళ్లు, స్థలాలు కోల్పోయినవారికి ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కలెక్టరు అనుదీప్ చెక్కులను అందించారు.
ఎంపీ మాట్లాడుతూ.. ఎంజీబీఎస్ నుంచి చంద్రయాన్‌గుట్ట వరకు మెట్రో రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఏ సీఎం ఆసక్తి చూపలేదని, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ముందుకువెళుతున్నారని ప్రశంసించారు.