తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్‌పై కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదని అన్నారు.
ఏటా ఈ కేసులు నమోదు కావడం సహజమేనని తెలిపారు. హెచ్‌ఎంపీవీ సోకితే దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయని దినేష్ వివరించారు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.