యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, తాగునీరు, శానిటేషన్ తదితర కార్యక్రమాల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు బాబు, సుగుణాకర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.