ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివేవారు మధ్య, సాధారణ కుటుంబ విద్యార్థులేనని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. అందుకే సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ ఆలోచన మేరకు మధ్యాహ్నం భోజనం పథకం అమలుచేస్తున్నట్లు వివరించారు.
వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు కిట్స్ ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఆడపిల్లలకు పౌషికాహారం అందించాలనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.