వ్యవసాయంలో యాంత్రీకరణ అవసరం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసిందని, వ్యవసాయంపై కనీస దృష్టిపెట్టలేదని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, యాంత్రికరణను ప్రోత్సాహిస్తామని వివరించారు. డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయరంగంలో ప్రవేశపెడతామన్నారు. వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీని అందిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయంలో భూసార పరీక్షలు అవసరమని చెప్పారు.