తొందరంగా వెళ్లాలనే హడావుడిలో ప్రమాదాలకు కారణం కావద్దని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. రోడ్డు ప్రమాదాలపై సోషల్‌మీడియా వేదికగా నిరంతరం అవగాహన కల్పించే సజ్జనార్.. ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
ఆయన పోస్ట్‌చేసిన వీడియోలో ఓ కారు నడిరోడ్డుపై ఆపి, అకస్మాత్తుగా కారు డోర్ తీయడం వల్లప్రమాదం జరుగుతుంది. దీనిపై సజ్జనార్.. ఇదేం నిర్లక్యం.. కనీస మానవత్వం కూడా లేదా? అని ప్రశ్నించారు.