ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనుండడంతో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కమలం పార్టీ రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లిస్టులో 29 మంది పేర్లను ప్రకటించగా మాజీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌పై బీజేపీ తరపున పర్వేష్ వర్మ పోటీ చేయబోతుండగా అలాగే ప్రస్తుత సీఎం అతిషిపై పోటీకి రమేష్ బిదురిని కమలం పార్టీ రంగంలోకి దింపబోతోంది. ఇక ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ పేరు తొలి జాబితాలో లేకపోవడం గమనార్హం.