మధ్యప్రదేశ్‌లో యూనియన్ కార్బైడ్ వ్యర్థాల దహనం ఉద్రిక్తతలకు దారితీసింది. 337 టన్నుల హానికర వ్యర్థాల తరలింపు, దహనం వ్యవహారం పీథంపుర్ పారిశ్రామికవాడలో వ్యర్థాలను దహనం చేసేందుకు ఉద్దేశించిన యూనిట్‌పై కొంతమంది రాళ్లదాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ చర్యతో తమ భద్రత ప్రమాదంలో పడుతుందని, పర్యావరణ సమస్యలూ ఉత్పన్నం అవుతాయని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇద్దరు నిరసనకారులు ఆత్మాహుతికియత్నించగా సహచరులు రక్షించారు.