జూనియర్ కాలేజీల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.నాణ్యమైన విద్యను అందించేందుకు మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారని అన్నారు. గతంలో బడి పిలుస్తుంది పేరుతో విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి సీఎం చంద్రబాబు ఈ రంగానికి ఎంతో ఖర్చు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు చుట్టూ మంచి వాతావరణం ఉండటం కూడా అవసరమని తెలిపారు . అటువంటి వాతావరణాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని అన్నారు. విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడిపించేందుకే పేరంట్ టీచర్స్ మీటింగ్‌లను నిర్వహిస్తున్నామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.