గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో ఆకస్మికంగా హోం మంత్రి వంగలపూడి అనిత ఇవాళ(శనివారం) తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి హోం మంత్రి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని పోలీసులకు హోం మంత్రి అనిత సూచించారు.