ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని సీదిరి అప్పలరాజు సూచించారు. ఈ హైబ్రిడ్ మోడల్లోకి వెళ్తే ప్రజలకు మేలు జరగదన్న విషయాన్ని డిప్యూటీ సీఎం చర్చించాలన్నారు. జీతాలు,పెన్షన్లు ఇవ్వడం తప్ప ఈ ఆరు నెలల్లో చంద్రబాబు చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా..? అని నిలదీశారు. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చిన ప్రాజెక్టులు గాని కంపెనీలు గాని వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కృషి వల్ల మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. వైయస్ జగన్ చేసిన మంచి పనులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకుంటున్నారని సీదిరి అప్పలరాజు ఆక్షేపించారు.