అనంతపురం నగర శివారులోని టీచర్స్‌కాలనీలో ఒంటరిగా నివాసముంటున్న పొమ్మల సావిత్రమ్మ(63)ను గొంతుకోసి హత్య చేశారు. ఈ హత్య సోమవారం మధ్యాహ్నం 1.30గంటల నుంచి 4గంటల మధ్యలో జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. సావిత్రమ్మ భర్త ఓబులేసు అటవీశాఖలో రిటైర్డ్ అయ్యారు. కొన్నేళ్ల కిందటే ఆయన మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటోంది. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్దకుమారుడు విజయ్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన ప్రస్తుతం తన కుటుంబంతో కోవూరునగర్‌లో నివాసముంటున్నాడు. రెండో కుమారుడు జయకుమార్, కుమార్తె పూర్ణిమ అమెరికాలో ఉంటున్నారు. పెద్ద కుమారుడు విజయ్‌కుమార్ సోమవారం తన తల్లికి భోజనం క్యారియర్ ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం 4.30గంటల సమయంలో ఇంట్లో పనులు చేయడానికి పనిమనిషి రమణమ్మ వచ్చింది. ఎంతసేపు పిలిచినా సావిత్రమ్మ పలకలేదు. దీంతో అడ్డంగా వేసిన డోర్‌ను తెరిచి లోపలికి వెళ్లింది. అక్కడ రక్తపు మడుగులో ఉన్న సావిత్రమ్మను చూసి, వెంటనే విషయాన్ని పెద్దకుమారుడికి ఫోన చేసి చెప్పింది. దీంతో విజయ్‌కుమార్ నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. ఫోర్త్‌టౌన సీఐ సాయినాథ్, ఎస్ఐ రాంప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సావిత్రమ్మ గతంలో అంగనవాడీ టీచర్‌గా పనిచేసినట్లు చెబుతున్నారు. 2015లో ఆమె ఆ పోస్టుకు రిజైన చేసినట్లు సమాచారం.