రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్గ్రేషియాను పెంచింది. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే చేనేత, చేతివృత్తులు చేసుకునేవారు ముంపుబారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. మరోవైపు ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించింది.