ఆత్రేయపురం, వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీతో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. వేకువజామునే స్వామివారికి గోదావరి జలాలను తీర్థపు బిందెతో తీసుకువచ్చి స్నపన మూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం తిరుప్పావై వేద పారాయణం జరిపారు. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొ న్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.3,46,971 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధర రావు తెలిపారు.