తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం నాడు హరిణి వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు భక్తులు, ఉద్యోగులకు గాయాలయ్యాయి. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో దాదాపు ఎనిమిది కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బస్సును రోడ్డుకు అడ్డం తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రేన్‌తో బస్సును తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.