చిత్తూరు జిల్లా, నారావారిపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. సోలార్ పాలసీపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు. ప్రో యాక్టివ్‌గా ఉండాలని కలెక్టర్‌కు చంద్రబాబు చురకలు అంటించారు. సోలార్ పాలసీ మీద సంబంధిత విభాగం వారికి కూడా అవగాహన లేకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారావారిపల్లి సమీపంలోని 2వేల ఇళ్లకు సోలార్ విద్యుత్ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. 2కేవీ వరకు ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సోలార్‌తో వినియోగదారులకు ఎదురు డబ్బు వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.