స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా టీడీపీ నేతలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. విజయవాడ పటమట సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా అన్న ఎన్టీఆర్ అలుపెరగని యోధుడిలా ఎన్నో రికార్డ్స్ సృష్టించారన్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి పార్టీని తీసుకువచ్చి అరుదైన రికార్డ్ సృష్టించారని తెలిపారు.మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు కోటి సభ్యత్వాలతో ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. పేదవాళ్లకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో దేశానికి సంక్షేమ పథకాల మార్గదర్శనం చేసిన దార్శనికుడు అని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముందు వెళ్లారన్నారు. టీడీపీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ, ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రాజకీయ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి, ఢిల్లీలో కూడా తెలుగు వాడి సత్తా చూపించిన ఘనుడు ఎన్టీఆర్ అని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.