ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ‘ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు జనవరి 16వ తేదీన తిరుపతిలోని మహతి అడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు డిసెంబరు 20వ తేదీన టీటీడీ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. క్యాబినెట్ ర్యాంక్ ప్రొటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం 14న శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసింది. వయసు రీత్యా ఆలయం ముందున్న బయోమెట్రిక్ నుంచి దర్శనానికి వెళ్లే సదుపాయం ఉన్నప్పటికీ చాగంటి సున్నితంగా తిరస్కరించారు. సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో అసత్య కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని టీటీడీ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది.