ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజధాని ప్రజలకు హామీల వర్షం కురిపిస్తోంది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వాసులకు తాజాగా మరో హామీని ప్రకటించారు.
తాము మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజధానిలో అద్దె ఇళ్లల్లో నివసించే వారికి ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని పేర్కొన్నారు. కాగా ఆప్ ఇప్పటికే వృద్ధుల కోసం సంజీవని స్కీమ్, మహిళల కోసం ‘మహిళా సమ్మాన్’ హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.