రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీతో విజయనగరం జిల్లాలో కొత్తగా మరో 15 షాపులు రానున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ పెంపు అమలు కానుంది. జిల్లాలో ప్రస్తుతం 177 షాపులు ఉన్నాయి. అదనంగా 15 షాపులు రానున్నాయి. యాత, గౌడ, ఈడిగ, శ్రీశయన, సొండి, శెట్టిబలిజ కులస్తులకు జనాభా ప్రాతిపదికన ఈ మద్యం షాపులను కేటాయించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.