ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. భారతీయ టెక్ నిపుణులకు పండగే ఇక

international |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2025, 09:51 PM

హెచ్1బీ వీసాల్లో రాబోయే మార్పుల గురించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు తెగ టెన్షన్ పడిపోయారు. కానీ వారందరికీ జోబైడెన్ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. హెచ్1బీ వీసాల్లో భారీ మార్పులు చేపట్టి.. విదేశీ టెక్ నిపుణులు భారీగా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంది. ఈ మార్పుల వల్ల ఎక్కువగా లాభపడేది భారతీయ నిపుణులే. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


హెచ్-1బీ వీసా నిబంధనల్లో అమెరికా గణనీయమైన మార్పులను చేపట్టింది. దీని వల్ల అమెరికన్ కంపెనీలు మరింత తేలికగా విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు వీలు కల్పించింది. ముఖ్యంగా ఎఫ్-1 విద్యార్థి వీసాలను సులువుగా హెచ్1బీ వీసులు మార్కుకునే వెసులుబాటు కల్పించింది. ఈ కొత్త నిబంధనలను జనవరి 17వ తేదీ అంటే శుక్రవారం రోజు నుంచి అమల్లోకి కూడా తీసుకు వచ్చింది.


ఈ మార్పుల వల్ల అత్యంత నైపుణ్యం కల్గిన విదేశీ కార్మికులకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ సంస్కరణను ప్రవేశ పెట్టినట్లు జోబైడెన్ సర్కారు వివరించింది. ముఖ్యంగా దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు న్యాయమైన, పారదర్శకమైన, సామర్ధ్యాన్ని పెంచేలా ఈ మార్పులు తీసుకు వచ్చినట్లు తెలిపింది. 2023లో హెచ్1బీ వీసాలు పొందిన 3,86,000 మందిలో 72.3 శాతం భారతీయ నిపుణులు ఉండడంతో.. ఈ మార్పుల వల్ల వారికే ఎక్కువగా లాభాలు పొందబోతున్నారు. యూఎస్‌లో మంచి వేతనాలు లభించే కీలక ఉద్యోగాల్లో భారతీయులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.


హెచ్1బీ అర్హత ప్రమాణాల్లోలో ఒకైటన "స్పెషాలిటీ ఆక్యుపేన్" నిర్వచనంలో మార్పు తీసుకు వచ్చింది. దీంట్లో ఉద్యోగానికి నేరుగా సంబంధించిన డిగ్రీ అవసరం అయినప్పటికీ.. డిగ్రీ మరియు ఉద్యోగు విధుల మధ్య లాజికల్ కెక్షన్ ఉండాలని తెలిపింది. ఇది విభిన్న విద్యా నేపథ్యాలుకల్గిన నిపుణులకు లబ్ధి చేకూరేలా చేస్తుందని చెప్పింది. అలాగే కంపెనీలు ఎక్కువ మొత్తం దరఖాస్తులు పొందకుండా కఠినమైన నియమాలు తీసుకుంటోంది. ఈ మార్పు వల్ల చిన్న సంస్థలు మరియు వ్యక్తిగత దరఖాస్తుదాలు సులువుగా వీసాలు పొందవచ్చు.


అలాగే హెచ్1బీ వీసాలకు మారాలనుకుంటున్న ఎఫ్-1 వీసా విద్యార్థులు ఈ మార్పుల వల్ల తక్కువ సవాళ్లను మాత్రమే ఎదుర్కుంటారు. హెచ1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు నేరుగా వారి ఎఫ్1 వీసా గడువు ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడగించబడుతుంది. అలాగే హెచ్1బీ వీసా దరఖాస్తులను కూడా చాలా వేగవంతం చేస్తున్నాయి ఈ కొత్త నిబంధనలు. దీని వల్ల కార్మికులు, యజమానులు ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు.


ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తన వెబ్‌సైటులో..హెచ్1బీ తుది నియమం ఆమోద ప్రక్రియను క్రమబద్దీకరించడం ద్వారా హెచ్1బీ ప్రోగ్రామ్‌ను ఆధునీకరించిందని తెలిపింది. అలాగే ప్రతిభావంతులైన కార్మికులను ఉంచడానికి మెరుగైన యజమానులను అనుమతించడానికి, సమగ్రతను మెరుగు పరచడడానికి దాని సౌలభ్యాన్ని పెంచుతుందని చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com