బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై గురువారం రోజు ఉదయం దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈకేసును చాలా సీరియస్‌గా తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. ఈక్రమంలోనే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తిని గుర్తించి అతడి ఫొటోను కూడా విడుదల చేశారు. ఆఫై ఘటన జరిగిన 30 గంటల్లోనే అతడిని పట్టుకున్నారు కూడా. కానీ విచారణలో అసలు నిందితుడు అతడు కాదని గుర్తించి మళ్లీ సైఫ్ ఇంటికి వెళ్లారు. ఈక్రమంలోనే అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలే లేవని తెలుసుకుని షాకయ్యారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
బాలీవుడ్ స్టార్ కపుల్స్ అయిన సైఫ్ అలీఖాన్ - కరీన్ కపూర్ దంపతులు నివసిస్తున్న ఇంట్లో అసలు సీసీ కెమెరాలే లేవని ముంబయి పోలీసులు తాజాగా గుర్తించారు. ఆ విషయం తమకు చాలా ఆశ్చర్యాన్ని కల్గించిందని కూడా చెప్పారు. పిల్లలతో సహా కలిసి ఉంటున్న బాంద్రాలోని విలాసవంతమైన ఇంట్లో.. ఎలాంటి భద్రతా చర్యలు లేవని వివరించారు. ఈక్రమంలోనే నిందితుడిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.
ముఖ్యంగా నిందితుడు ఇంట్లోకి ప్రవేశించాడో తెలుసుకునేందుకు శుక్రవారం రోజు మరోసారి సైఫ్ ఇంటిని పరిశీలించారు పోలీసులు. ఫోరెన్సిక్ నిపుణులతో పాటు, వేలిముద్ర విశ్లేషకులను కూడా తీసుకు వెళ్లారు. ఈక్రమంలోనే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పర్సనల్ సెక్యూరిటీ గార్డులు కూడా లేని విషయాన్ని గుర్తించారు. ముఖ్యంగా ఎవరైనా జనాలు ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే ఆపేందుకు కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం.
ఇది మాత్రమే కాకుండా భవనంలోకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు బయటకు వెళ్తున్నారో తెలుసుకోవడానికి తగిన రిజిస్టర్ పుస్తకాన్ని కూడా నిర్వహించకపోవడం చూసి పోలీసులు షాకయ్యారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి సెలబ్రీట జంటకు ఏమాత్రం భద్రతా చర్యలు లేకపోవడం చూసి తాము ఆశ్యర్యపోయినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఇది జంటకు మాత్రమే కాదని.. మరెంతో మంది సెలబ్రిటీలకు మేల్కొలుపు అంటూ వివరించారు.
రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్ హత్య, నటుడు సల్మాన్ ఖాన్‌పై ఇటీవల బెదిరింపులు వంటి సంఘటనలను చూస్తుంటే.. సెలబ్రిటీలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని అర్థం అవుతుందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా గతేడాది సల్మాన్ ఖాన్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దుండగులు ఆయన నివాసంపై కాల్పులు జరిపారు. అప్పట్లో ఈ ఘటన చర్చనీయాంశం అయింది.