ఆమ్ ఆద్మీ పార్టీని మరోసారి గెలిపిస్తే ఢిల్లీలో నివసించే వారికి ఉచిత విద్యుత్, ఉచిత తాగునీటిని అందిస్తామని మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. శనివారం నాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఢిల్లీలో అద్దెకు ఉండేవారికి కూడా ఉచిత విద్యుత్, తాగునీటిని అందిస్తామన్నారు. ఇదివరకు అద్దెదారులకు ఈ ప్రయోజనం అందలేదన్నారు. ఇక ముందు ఇస్తామన్నారు.ఢిల్లీలో నివసిస్తున్న చాలామంది అద్దెదారులు పూర్వాంచల్‌కు చెందినవారు అన్నారు. వారిలో చాలామంది నిరుపేదలు అని తెలిపారు. వారు ఎలాంటి సబ్సిడీలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఈ సమస్యను తాము పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇందులో భాగంగా తాము మళ్లీ అధికారంలోకి వస్తే అద్దెదారులకు కూడా ఉచిత తాగునీరు, ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.