ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిసరాల పరిశ్రుభ్రత మనందరి బాధ్యత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2025, 05:08 PM

 'స్వచ్ఛంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కల్యాణ్ తెలిపారు. నంబూరులో శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కంపోస్ట్ యంత్రాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... పరిశ్రుభ్రత కల్చర్ అవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. చెత్త ఎక్కడపడితే అక్కడ పడేయకూడదని అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు అని పవన్ కల్యాణ్ తెలిపారు. పరిశుభ్రత ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చిందన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచటం అనేది ఏ ఒక్కరి వల్లో అయ్యేది కాదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారని అన్నారు. వెంటనే అద్భుతాలు ఆశించలేమని.. కానీ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పవన్ కల్యాణ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com