దివ్యాంగులకు స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా స్వాభిమాన్ కార్యక్ర మాన్ని ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం లోని జడ్పీ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తోకలిసి దివ్యాంగుల నుంచి 17 వినతులను స్వీకరించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం సచివాలయం ఉద్యోగుల ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో వారి అవసరాలను గుర్తించి మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో కె.భారతీ సౌజన్య, ఉపాధి కల్పనాధికారి కె.సుధ, గృహనిర్మాణ సంస్థ పీడీ గణేష్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం.సూర్యకిరణ్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ పాల్గొన్నారు.